ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

ప్రతిపక్షం విమర్శలు పట్టించుకోండి: – ఎల్‌.ప్రఫుల్లచంద్ర, ధర్మవరం, అనంతపురంజిల్లా

కరోనా కట్టడిలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సరైన జవాబు ఇవ్వాలి. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న పథకాలు గురించి సమాచార శాఖ ద్వారా తెలియచేయాలి. కరోనాపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలలో ఎంత వరకు నిజం ఉంది అన్నది అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏదిఏమైనా ప్రతిపక్షం విమర్శలు సరిదిద్దుకుంటే మనకే మంచిది కదా అని ఆలోచించాలి. సద్విమర్శలు సానుభూతితో పరిశీలించి పరిష్కారం చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా కరోనా నియంత్రణలో మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమం, వాటి వివరాలు సంపూర్ణంగా తెలిపాలి.

అప్పుడు ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల గురించి అటు ప్రతిపక్షం వారికి అర్థం అవుతుంది. ఇటు ప్రజలకు స్పష్టం కాగలదు. ఒకవైపు చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఈ విమర్శలపై ఏ విధంగా సమాధానం ఇస్తారో వేచి చూద్దాం.

మద్యం ధరలు తగ్గుతాయా?:-యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

అంచెలంచెలుగా మద్య నిషేధం అమలు చేస్తామని అధికారం చేపట్టి, గొలుసు దుకాణాలు తొలగింపు, ఇరవై శాతం దుకాణాలు తగ్గించామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మద్యం దుకాణాలు తెరచి డెబ్భైఅయిదు శాతం ధరలు పెంపు ద్వారా మందు బాబులను నియంత్రిస్తున్నట్టు చెప్పారు. అయినా రాష్ట్రంలో కరోనా కేసులు ఐదు లక్షల చేరువలో ఉన్నాయి.

ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవ్ఞతున్నారు. రోజూ పదివేల కేసులు దాటి విలయతాండవం చేస్తున్న సమయంలో మద్యం ధరలు ఎందుకు తగ్గిస్తున్నారో అర్థంకానున్నది. ప్రతి ఒక్కరిని కరోనాతో కలిసి కాపురం చేయాలన్న ముఖ్యమంత్రి మాట అమలు జరిపే దిశగా ఉంది.

కార్యాలయాల్లో సిబ్బంది కొరత: -షేక్‌అస్లాంషరీఫ్‌, శాంతినగర్‌

కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సిబ్బంది కొతర వేధి స్తుంది. కొత్తగా ఏర్పడిన కార్యాలయాలకు సైతం సిబ్బంది అవసరంఉంది.సిబ్బందికొరత కారణంగా కొత్తగా నియా మకమైన ఉద్యోగులకు సరైన శిక్షణ కొరత ఏర్పడుతుంది.

దీనివల్ల ఏపని ఎలా చేయాలో అర్థంకాక జరగాల్సిన పని జరగక పనులు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వం సిబ్బంది కొరతనుఅధిగమించాలి.

ఇంధన సామర్థ్యాన్ని పెంచాలి:-ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరు జిల్లా

ఇంధన సుస్థిరత ప్రజలకు, పరిశ్రమలకు నిరంతరం నాణ్య మైనవిద్యుత్‌ను సరసమైన ధరలకు అందించే సుస్వప్నం సాకా రమయ్యేందుకు ఇంధన సామర్థ్య రంగానికి చేయూతనివ్వడం చాలాముఖ్యం.

దేశంలోప్రధమంగాఎనర్జీఎఫీషియన్స్‌ పథకాలను చేపట్టి నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో గుజరాత్‌ ప్రభు త్వం అగ్రపథంలోకొనసాగుతుంది.

ఆ రాష్ట్రం సాధించిన అనితర సాధ్యమైన ఫలితాల స్ఫూర్తిగా మన రాష్ట్రం కూడా ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి.

వివిధ రంగాలలో ఎనర్జీ ఎఫిషీయన్సీని ప్రవేశపెట్ట డంతోపాటు కాలుష్యస్థాయి తక్కువగా ఉండే సాంకేతికతలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆయా రంగాలలో అనుభవం ఉన్న అంతర్జాతీయసంస్థల సహయంతీసుకోవడం ఎంతో ముఖ్యం.

కొవిడ్‌ సెంటర్లపై నిఘా పెంచాలి:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

విజయవాడలోని ఒకహోట్‌లో అనధికారికంగా నడుస్తున్న ఆస్ప త్రిలో అగ్నిప్రమాదం సంభవించి10మంది కరోనా రోగులు మరణించడం,ఇంకొక 20మంతితీవ్రంగా గాయపడడం దిగ్భ్రాం తికరం.

అనుమతులు లేకుండా, అన్ని భద్రతా ప్రమాణాలను తుంగలోకి తొక్కికొవిడ్‌ సెంటర్‌ను నడుపుతున్న యాజమాన్యంపై కఠినచర్యలు తీసుకోవాలి.

కనీసం అగ్నిమాపకశాఖ నుండి ఎస్‌జిసిలేకుండా అయిదేళ్లనుండి హోటల్‌ నడుపుతున్నహోటల్‌ యాజమాన్యంపైకూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

అనధికారకంగా ఇలాంటికొవిడ్‌ సెంటర్లు రాష్ట్రంలో వందల సంఖ్య లోఉన్నాయన్న మీడియావార్తల నేపథ్యంలో వీటినియంత్రణకు రాష్ట్రప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి.

దోపిడీని నివారించాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

రాష్ట్రంలో ప్రైవేట్‌ డయోగ్నొస్టిక్‌సెంటర్లలో యాంటిజిన్‌ టెస్టులకుప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోయినా90శాతం సెంటర్లలోయాంటిజిన్‌టెస్టులు జరుగుతున్నాయి.

ప్రభుత్వ ముందస్తుఅనుమతులు లేకుండానే పొరుగురాష్ట్రాల నుండి ర్యాపిడ్‌యాంటిజిన్‌ టెస్ట్‌కిట్‌లను తీసుకువచ్చి పెద్ద మొత్తం వసూలుచేస్తున్నారు.

సాధారణ జ్వరాలకు కూడా కరోనా టెస్టులు చేయిస్తేనే వైద్యం చేస్తామని ప్రైవేట్‌ క్లీనిక్‌లు తేల్చి చెప్పడంవలన రోగులకు ఇంకొక గత్యంతరం లేకుండా పోయింది.

కాబట్టి వైద్య ఆరోగ్యశాఖ తక్షణం స్పందించి కరోనా దోపిడీని నివారించాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/