కొబ్బరినూనెలో ఔషధ గుణాలు
ఇంటింటా చిట్కాలు
![Medicinal properties of coconut oil](https://www.vaartha.com/wp-content/uploads/2020/09/Medicinal-properties-of-coconut-oil.jpg)
కొబ్బరినూనె నుండి సాధారణంగా ఒక తియ్యటి వాసన వస్తుంది. ఈ నూనెను కేవలం మర్దన కోసమో, వంటకు మాత్రమే ఉపయోగిస్తారు. అనుకుంటే పొరపాటే. అంతకుమించిన ఉపయోగాలెన్నో కొబ్బరినూనె వల్ల ఉన్నాయి.
కొబ్బరినూనెలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. కొబ్బరినూనె ఉపయోగించి ఇంటి వద్దే బట్టలు ఉతికే సబ్బు తయారుచేయవచ్చు.
ఎందుకంటే ఇందులో ఎన్నో సమతుల్యతతో కూడిన గుణాలు ఉన్నాయి. నురగ వచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
కొబ్బరినూనెలో యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తెగిన గాయాలను త్వరగా మాన్పివేయడానికి ఈ నూనె సహాయపడుతుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/