పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన జేసి

J. C. Diwakar Reddy
J. C. Diwakar Reddy

అనంతపురం: టిడిపి నేత జేసి దివాకర్‌రెడ్డి శనివారం అనంతపురంలోని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొండిపోయారు. కాగా లోగడ పోలీసులతో తన బూట్లు నాకిస్తానని జేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌ నాథ్‌ ఫిర్యాదు మేరకు ఆయనపై ఇటీవల పోలీసులు పలు సెక్షన్ల కింద జేసిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు జేసి దివాకర్‌రెడ్డి పోలీసులకు లొంగిపోయారు. అయితే సొంత పూచీకత్తుతో పాటు నెలలో రెండు సార్లు స్టేషన్‌లో సంతకాలు చేయాలని ఆయనకు న్యాయస్థానం షరతులు విధించింది. మరోవైపు రాష్ట్ర పోలీసులకు జేసి దివాకర్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని కడప జిల్లా పోలీసు అధికారుల సంఘం కూడా ఇటీవలే డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/