వైసీపీ లో విషాదం : అంబటి అనిల్ మృతి

విజయనగరం వైసీపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయనగరం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందారు. నిన్న రాత్రి సడెన్ గా ఇంట్లో పడిపోవడం తో వెంటనే కుటుంబ సభ్యులు విజయ నగరం లోని ఓ ప్రముఖ ఆస్పత్రి కి తరలించారు. అనిల్‌ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

విజయ నగరం జిల్లా పరిషత్ లో చిన్న వయసులోనే జడ్పిటిసిగా అంబటి అనిల్‌ గుర్తింపు పొందాడు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడే అంబటి అనీల్. అనీల్ సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. ఇక అనీల్ మృతి తో ఆయన కుటుంబం లో విషాదం నెలకొంది. అనిల్‌ మృతి పట్ల వైసిపి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.