బోస్టన్‌ కమిటీకి తలా తోక ఉందా?

బోస్టన్‌ గ్రూప్‌ క్లయింట్‌ వద్ద డబ్బులు తీసుకొని ఏది కావాలంటే అది రాసిచ్చే సంస్థ

chandrababu naidu
chandrababu naidu

మంగళగిరి: బోస్టన్‌ కమిటీ నివేదికపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. శనివారం మంగళగిరిలోని టిడిపి పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ క్లయింట్‌ వద్ద డబ్బులు తీసుకుని ఏది కావాలంటే అది రాసిచ్చే సంస్థ అని విమర్శించారు. బోస్టన్‌ కమిటీకి తలాతోక ఉందా? అని ప్రశ్నించారు. అసలు బోస్టన్‌ కమిటీని ఎప్పుడు వేశారో కూడా చెప్పకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. రాజధానిపై బోస్టన్‌ గ్రూప్‌ను నివేదిక ఇవ్వమని అడిగే హక్కు మీకు ఎక్కడదిని వైఎస్సాఆర్‌సిపి నేతలను ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌ రెడ్డికి బోస్టన్‌ గ్రూప్‌తో సత్సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ నివేదిక అంతా బూటకమని దానికి విశ్వసనీయత లేదన్నారు. తప్పుడు నివేదికలతో ప్రజలను మోసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/