రక్తపోటు తగ్గించే అల్లనేరేడు

పండ్లతో సంపూర్ణ ఆరోగ్యం

jamun fruit- to control blood pressure
jamun fruit- to control blood pressure

నేరేడు పండు షుగర్‌ వ్యాధి ఉన్నవారికి మంచి ఔషధం అని చెప్పవచ్చు. మధుమేహంతో బాధపడేవారు నేరేడు గింజల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల శరరంలోని చక్కెర శాతాన్ని తగ్గించుకోవచ్చు.

అంతేకాకుండా ఇది అధిక రక్తపోటు సమస్యను తగ్గించి గుండెను ఆరోగ్యాంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయపనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోసిస్తాయి.

నేరేడు పండు రక్తాన్ని శుద్ధి చేయడమే కాదు రక్తంలో కేన్సర్‌ కారకాలు వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. ఇందులో ఉండే ఐరన్‌, విటమిన్‌ సి రక్తంలోని హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతాయి.

నేరేడుపండు సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్‌ మాంగనీస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, సితో పాటు రైబోప్లెనిన్‌, పోలిక్‌ యాసిడ్లను సమృద్ధిగా కలిగి ఉంటుంది.

ఈ పండ్లను తినం వల్ల దంత సమస్యలు దూరమవుతాయి. ఇది దంతాలను, చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులను, అల్సర్లను నివారిస్తుంది.

దంతక్షయాన్ని తగ్గిస్తుంది. నేరేడు గింజల పొడి ముఖానికి ప్యాక్‌గా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పండు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

కడుపులో ఏర్పడే గ్యాస్‌ వంటి సమస్యలకు ఇది ఒక చక్కని పరిష్కారం. కడుపు ఉబ్బరం, వాంతి అయ్యేలా ఉండే లక్షణాలను తగ్గిస్తుంది.

మలబద్ధకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేస్తుంది. అనేక చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు సహాయపడుతుంది.

అంతేకాకుండా కీళ్లనొప్పులను, లివర్‌ సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/