ఆకలిబాధ లేకుండా

లాక్‌డౌన్‌ వేళ విద్యార్థులకు ఆసరా

ఆకలిబాధ లేకుండా

కరోనా కారణంగా మూతబడిన పాఠశాలల్లోని చిన్నారుల ఆకలి గురించి ఆలోచించింది హాలీవుడ్‌ నటి ఏంజెలినాజోలీ. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసిన నేపధ్యంలో మధ్యాహ్నభోజన పధకం ద్వారా లబ్ది పొందే విద్యార్థులు ఆకలితో ఉండకూడదని ఆలోచించిందీ 44 ఏళ్ల అందాలనటి. ఇందు కోసం ఏడున్నర కోట్ల రూపాయలను ‘నో కిడ్‌ హంగ్రీ అనే సామాజిక సేవాసంస్థకు అందించింది. బడులకు సెలవులు ప్రకటించడంతో ఇంటివద్దకే వెళ్లి ఆ చిన్నారుల కుటుంబాలకు తగిన విధంగా చేయూతనందిస్తాం అంటోంది ఏంజెలినా. ‘పాఠశాలలు మూసివేయడంతో ఒక్క అమెరికాలోనే రెండు కోట్ల మందికిపైగా విద్యార్థులు భోజనానికి దూరమయ్యారు. వీరందరి ఆకలి తీర్చేదిశగా ‘నో కిడ్‌ హంగ్రీ కృషి చేస్తోంది. ఈ సంస్థకు అందరం కలిసి చేయూతనందిస్తే మరెన్నో కోట్లమంది చిన్నారుల వద్దకు ఆహారాన్ని చేర్చి, వారి ఆకలి తీర్చగలం అని చెబుతున్న ఏంజెలినా ఇప్పటికే యూఎన్‌ ఎఫ్యూజీ ఏజెన్సీతో కలిసి ఆఫ్గానిస్థాన్‌, కంబో డియా, కెన్యా, నమీబియాలోని పలు పాఠశా లలకూ ఆర్థిక సాయం అందించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/