హుందాతనాన్నిచ్చే సాలిటెయిర్ డైమండ్స్
ఆభరణాలు-అలంకరణ

ఉద్యోగినులు సాధారణంగా తక్కువ నగలను ధరిస్తారు. అయితే ప్రత్యేకంగా ఉద్యోగినుల అలంకరణ కోసం తయారయ్యే నగలు ఉన్నాయి.
వాటి లో ప్రస్తుతం వస్తున్నది సాలిటెయిర్ డైమండ్స్. డైలీవేర్‌గా ఉద్యోగినులు సాలిటెయిర్ నగలను ఎంచుకోవచ్చు.
సింపుల్‌గా, హుందాగా, ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటే ఈ నగల్ని ఎంచుకోవాలి. తక్కువ బరువుతో, చక్కని మెరుపలీనే వజ్రాలతో తయారయ్యే ఈ నగలు రోజు ధరించడానికి వీలుగా, ఎలాంటి వస్త్రధారణకైనా నప్పేట్లుగా ఉంటాయి.
కష్టపడి డబ్బులు కూడబెట్టే ఉద్యోగినులు ప్రతిరోజు వాడుకోవడానికి వీలుండే నగలు కొనుక్కోవాలి.
తక్కువ బరువు, నాణ్యల కలిగిన మేలు రాళ్లు పొదిగిన నగలయితే పెట్టుబడికి తగిన వాడకం ఉంటుంది.
సాలిటెయిర్ డైమండ్స్ పొదిగిన నగలైతే చుడీదార్, చీరలు, స్కర్ట్, జీన్స్ ఇలా సంప్రదాయ కట్టుబొట్టుతో పాటు ఎలాంటి ఆధునిక వస్త్రధారణకైనా సూటవుతాయి.
బంగారంలో పొదిగిన సాలిటెయిర్ డైమండ్స్ ఇప్పుడు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఉంగరం, బ్రేస్‌లెట్, పెండెంట్ ఈ మూడు కలిపి సెట్‌గా కొనవచ్చు.
సాలిటెయిర్ డైమండ్స్‌ను సెంట్‌లతో కొలుస్తారు. ఈ నగలను కొనేటప్పుడు రాళ్ల మెరుపు, బరువు, వాడిన బంగారం, తరుగుల గురించి తెలుసుకోవాలి.
నగల్లో ఒక్క రాయితో తయారైన పెండెంట్లు తీసుకోవచుత్చ.
ఎక్కువగా మెరవాలంటే క్లస్టర్ డైమండ్ నగల్ని ఎంచుకోవచ్చు.
బంగారం ఇష్టపడని కాలేజీ అమ్మాయిలు ప్లాటినంతో తయారైన సాలిటెయిర్ డైమండ్ నగల్ని ఎంచుకోవచ్చు. ఇవి వెస్టర్న్ వేర్ మీదకు చక్కగా నప్పుతాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/