నాగార్జునసాగర్ 4 గేట్లు ఎత్తివేత

పర్యాటకులు ఎవరూ నాగార్జున సాగర్‌కు రావొద్దని విజ్ఞప్తి

nagarjuna-sagar

నాగార్జునసాగర్‌: తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలు నిండు కుండల్లా మారాయి. ఇప్పటికే జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరచుకోగా.. తాజాగా నాగార్జున సాగర్గేట్లను కూడా ఓపెన్ చేశారు. నాలుగు క్రష్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తెల్లని పాలధారలా పులిచింతల ప్రాజెక్టుకు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లోని 4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా.. 29,880 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 320 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 290 టీఎంసీ నీళ్లు ఉన్నాయి.

నాగార్జున సాగర్ గేట్లు తెరచుకోవడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తే ఆ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వెళ్తుంటారు. కానీ ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. పర్యాటకులు ఎవరూ నాగార్జున సాగర్‌కు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/