శీతాకాలంలో వ్యాధులు

ఆరోగ్య భాగ్యం

Winter diseases
Winter diseases

వింటర్‌ అంటే శీతాకాం. ఇది జర్మనీ పదం విం ట్రూస్‌ నుండి వచ్చింది. దీని అర్థం టైమ్‌ ఆఫ్‌ వాటర్‌. చలికి నీరుగడ్డ కట్టడం వల్ల దీనకాపేరు వచ్చింది. మూమూలుగా చలికాలంలో వాతావరణ ఉష్ణోగ్రతలు 10-50 సి ఉంటాయి.

ఈ చలాకాలం డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకుంటుంది. ఈ కాలంలో (చెయిన్‌ ఆక్టివిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఎలర్జీస్‌, ఇన్‌ఫ్మఏషన్‌, వ్యాధుల్ని కల్గించే రిస్క్‌ ఫ్యాక్టర్స్‌. ఇన్ఫెక్షన్స్‌ తగ్గుతాయి. శరీరం అధిక కేలరీల్ని బ్రేన్‌ ఫ్యాట్‌ని ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల ఆకలి ఉండి నిద్ర పడుతుంది.

సూర్యారశ్మి తక్కువగా ఉండడం వల్లా కాలుష్యం, మంచు, చల్లగాలులు, శరీర ఉష్ణోగ్రత్తలు తక్కువగా ఉండడం వల్లా శీతాకాలంకనుగుణంగా శరీరంలో మార్పులు కల్గడం, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశముంది.వీటినే శీతాకాల వ్యాధులు అంటారు.

శీతాకాలంలో 25% జీన్స్‌లోని డిఎన్‌ఎలో మార్పులు కల్గుతాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వాతావరణంలో మార్పులు, చల్లగాలి, మంచు దోమలు, కీటకాలు, రోడ్‌సైడ్‌ఫుడ్‌ తీసుకోవడంవల్ల, నీటి ద్వారా, నీరు తక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి.

చలికి, మంచుకు తట్టుకోలేక చాలా మంది ఇంటిలో ఉండడం, వెంటిలేషన్‌ సరిగా లేకపోవడం వల్ల కూడా చలికాలంలో రకరకాల వైరస్‌ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

ముఖ్యమైన శీతాకాల వ్యాధులు :

Winter diseases
Winter diseases

జలుబు :

సంవత్సరానికి 3-10సార్లు వాతావరణలోని మార్పులవల్ల, సీజన్‌ మారినప్పుడు, వైరస్‌ల వల్ల జలుబు ఎక్కువగా వచ్చే అవకాశముంది. దాదాపు 200 రకాల వైరస్‌లు జలుబుని కల్గిస్తాయి. వాటిలో రైనో వైరస్‌ ముఖ్యమైనది. ఇది చలికి, మంచుకి పిల్లల నుండి పెద్దల వరకు జలుబుని కల్గిస్తుంది.దీన వల్ల నాసల్‌ కంజేషన్‌, ముక్కుకారడం, తుమ్ములు తలభారం, తలనొప్పి, కళ్లునొప్పులు, కళ్లు నీళ్లు కారడం కొద్దిపాటి జ్వరం, చిరాకు, గొంతు, ముక్కులో ఇరిటేషన్‌, నొప్పి వంటి లోణాలుంటాయి. ఇది పిల్లల నుండి పెద్దవరక 2-4 రోజులుండి, తరుచుగా వచ్చే అవకాశముంది.

ఇన్‌ఫ్లుయెంజ్‌ లేదా ఫ్లూజ్వరం :

ఇది అంటువ్యాధి ఎపిడమిక్‌గా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువగా వస్తుంది. 5-25% మంది ముఖ్యంగా అతి చల్లని ప్రాంతాల్లోని వారు ఎక్కువగా ఎఫెక్ట్‌ అవుతారు. దీని వల్ల చలి, వణుకు, జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి జలుబు, దగ్గు, తలనొప్పి, వళ్లునొప్పులు, కళ్లు ఎర్రబడి, దురదగా నొప్పులుగా ఉండడం చెవినొప్పి, నీరసం వంటి లక్షటనాలుంటాయి. ఇన్‌ఫ్లుయెంజీ వైరస్‌ వల్ల ప్రతి సంవత్సరం అమెరికా, యుఎస్‌ వంటి దేశాల్లో 2 మిలియన్ల మంది బాధపడుతుంటారు.

బ్రారహైటిస్‌:

ఇది చలికాలంలో సర్వసాధారణమైన సమస్య. ఇది వైరస్‌, బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల ఎక్కువగా వస్తుంది. 5% పెద్దవారిలో 6% పిల్లల్లో కన్పించే సమస్యఇది. యుఎస్‌లో ప్రతిసంవత్సరం 9 మిలియన్‌ మంది క్రానిస్‌ బ్రారహైటిస్‌తో బాధపడుతుంటారు. వీరిలో నాసల్‌ కంజేషన్‌ దగ్గు, జ్వరం, పిల్లికూతలు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కఫం రావడం డీ హైడ్రీషన్‌ వంటి లక్షణాలుంటాఇ. ఇది పిల్లల్లో ఎక్కు వగా, తరుచుగా కన్పిస్తుంది. దీని వల్ల సైజిసైటిస్‌ టాన్సిలైరస్‌ ఎడినా యిడ్స్‌, నాసల్‌ పాలిష్‌ ఎలర్జీలు వంటి ఇతర సమస్యలు కూడా కన్పిస్తాయి.

గొంతునొప్పి:

చల్లని తేమగాలి సరిపోక పోవడం వల్ల, చల్లని పానీయాల వల్ల, మంచులో తిరిగిన గొంతు ఇన్ఫెక్షన్‌ వల్ల టాన్సిలైటిస్‌, ఎడినాయిడ్స్‌, లారింజైటిస్‌, ఫారింజైటిస్‌ వంటి వ్యాధుల వల్ల కూడా గొంతునొప్పి వస్తుంది.

దీనివల్ల ఆహారం మింగడం, నీరు త్రాగడం, గాలి పీల్చడం, మాట్లాడటం కష్టంగా మారుతాయి. గొంతు బొంగురుపోవడం. గొంతు తడి ఆరిపోవడం, నోరు దుర్వాసన, గొంతులో మంచు చెవినొప్పి, జ్వరం, నీరసం, చిరాకు వంట లక్షణాలుంటాయి.

ఇది పిల్లల్లో, వృద్దుల్లో ఎక్కువగా కన్పిస్తుంది. ది బాక్టీఇయల్‌, వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌వల్ల, ఎలర్జీన్‌ వల్ల, ఇంట్లో వాతావరణం పొడిగా ఉండడంవల్ల, ట్యూమర్స్‌ వల్ల కూడా గొంతునొప్పి వస్తుంది. దీనివల్ల తలనొప్పి, వికారం, వాంతులు, లింఫ్‌ గ్రంధుల వాపు వంటి లక్షణాలుంటాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/