సెప్టెంబరు 10 నుండి పార్లమెంట్ సమావేశాలు

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల పదో తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఒకరోజు లోకసభ సమావేశాలు, మరో రోజు రాజ్యసభ సమావేశాలు.. జరుగుతాయని సమాచారం. ఇలా నాలుగు వారాల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. లోకసభ సభ్యులందరూ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశమవుతారని, రాజ్యసభ సభ్యులు మాత్రం లోకసభ, రాజ్య సభలో కూర్చోనున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలందరికీ ‘ఆరోగ్య సేతు’ యాప్ కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని నిబంధన విధించారు. స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థ ప్రతి చోటా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆయా సభ్యుల వ్యక్తిగత సిబ్బందికి మాత్రం పార్లమెంట్‌లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/