జగ్గారెడ్డి కూడా పాదయాత్ర కు సిద్ధం

కాంగ్రెస్ నేతలు వరుస పెట్టి పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ , భట్టి లు పాదయాత్ర మొదలుపెట్టగా..ఇప్పుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేస్తా అంటున్నాడు. తెలంగాణలోని 47 నియోజకవర్గాలలో పాదయాత్ర చేయాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. తన పాదయాత్ర కు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేకు లేఖ రాశారు.

ఇప్పటికే రేవంత్ రెడ్డి ఓ విడత పాదయాత్ర పూర్తి చేశారు. మరో విడత ప్రారంభించబోతున్నారు. మరో సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్ర వరంగల్ వరకు వచ్చింది. ఇప్పుడు జగ్గారెడ్డి తాను కూడా పాదయాత్ర చేస్తానని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. గత మూడు రోజులుగా జగ్గారెడ్డి పేరు మీడియా లో తెగ వైరల్ అవుతుంది. వరుసగా ఈయన లేఖలు రాస్తున్నారు. గాంధీభవన్‌లో ప్రెండ్లీ పాలిటిక్స్ కరువయ్యాయని ఆరోపిస్తున్నారు. గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదన్నారు. తాను ను ఎవరి పేర్లు చెప్పదల్చుకోలేదని అన్నారు. కార్యకర్తలు,అభిమానులకు తెలియాలనేది తన ఆవేదనగా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. గాంధీ భవన్ లో ప్రశాంతత కరువైందన్నారు. దాదాపు ఐదు మాసాలుగా జగ్గారెడ్డి గాంధీభవన్ కు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు పాదయాత్ర చేస్తానని చెప్పి షాక్ ఇచ్చారు.