వినాయక చవితి వేడుకలపై స్పష్టత ఇవ్వాలి

విగ్రహాలు చేయాలో, వద్దో తేల్చుకోలేకపోతున్న తయారీదార్లు

rajasingh
rajasingh

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వినాయక విగ్రహాల తయారీదార్లు ఎంతో అయోమయానికి గురవుతున్నారని, వినాయకచవితి వేడుకలపై స్పష్టత ఇవ్వాలని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీలైనంత త్వరగా దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలని తెలంగాణ సీఎంవోను కోరారు. కనీసం 10 అడుగుల వినాయక విగ్రహాల తయారీకైనా అనుమతి ఇవ్వాలని, విగ్రహాల తయారీదార్లకు ఇదొక్కటే ఉపాధి కావడంతో వారిపై సానుభూతితో స్పందించి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవోకు రాజాసింగ్ లేఖ రాశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/