రామలక్ష్మి కి బర్త్ డే విషెష్ అందజేసిన చిట్టిబాబు

సమంత పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ అందజేశారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..సమంత కు బర్త్ డే విషెష్ తెలిపారు. ‘ప్రియమైన సమంత నీ పట్ల, నీ పని పట్ల ఎంతో గ‌ర్వ‌ప‌డుతుంటాను. నీ ఆరోగ్యం బావుండాల‌ని, మంచి స‌క్సెస్ ద‌క్కాల‌ని కోరుకుంటున్నాను. సిటాడెల్‌తో నీకు మంచి విజ‌యం ద‌క్కాల‌ని ఆశిస్తున్నాను’’ అన్నారు. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత క‌లిసి రంగ‌స్థ‌లం సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ప్రస్తుతం సమంత..విజయ్ దేవరకొండ తో ఖుషి మూవీ చేస్తుంది. శివనిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే రాజ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో సిటా డెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. తెలుగు లో రీసెంట్ గా ఈమె చేసిన శాకుంతలం మూవీ విడుదలై భారీ ప్లాప్ అందుకుంది. ప్రస్తుతం ఖుషి పైనే ఆశలు పెట్టుకుంది.