సుప్రీంకోర్టు తీర్పుతోనైనా జగన్ మారాలి

సీఎం జగన్ రాజీనామా చేసి ప్రజా తీర్పుకు వెళ్లాలి.. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి డిమాండ్

అమరావతి : సీఎం జగన్ ఇకనైనా రాజధాని అమరావతి భూముల కొనుగోలు అంశంపై తీరు మార్చుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. భూముల కొనుగోలులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిందని, ఆ తీర్పుతోనైనా మారాలని సూచించారు.

జగన్ తప్పులమీద తప్పులు చేస్తూ ఆనందం పొందుతున్నారని ఆయన ఆరోపించారు. సీఎం పదవికి వెంటనే రాజీనామా చేసి ప్రజా తీర్పుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన తప్పుల వల్ల ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనులు చాలా నిదానంగా సాగుతున్నాయన్నారు. నిర్వాసితులకు ఇస్తామన్న రూ.10 లక్షల పరిహారం ఇంతవరకూ ఇవ్వలేదని విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/