పెనుబల్లిలో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష

ఆత్మహత్య చేసుకున్న నాగేశ్వరరావు కుటుంబానికి షర్మిల పరామర్శ

పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు నిరుద్యోగ దీక్ష ప్రారంభించారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తానని ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గంగదేవిపాడుకు వెళ్లిన ఆమె.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కష్టాలు విని చలించిపోయిన ఆమె.. అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి.. దీక్షలో కూర్చున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/