ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలి

YouTube video
CM of AP Participation in 71st VANAMAHOSTAVAM at Ibrahimpatnam, Krishna District

కృష్ణాజిల్లా: ఏపి సిఎం జగన్‌ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గాజులపాడులోని 71వ వన మహోత్సవాన్ని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన అవుట్‌లో వేప, రావి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. వన మహోత్సవంలో భాగంగా 20 కోట్ల మొక్కల్ని నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 13 వేల పంచాయితీలు ఉంటే, 17 వేల లే అవుట్లు సిద్ధం చేశామని.. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. మొక్కల్ని నాటాలని కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు, అధికారులతో ఈ సందర్భంగా ప్రతిజ్ఙ చేయించారు.

అదే విధంగా… ఆగస్టు 15న 30 లక్షల మందికి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని సిఎం జగన్‌ తెలిపారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. 33 ఎకరాలలో 1600 మందికి జిల్లాలో ఇళ్ల పట్టాలను ఇస్తున్నామని సిఎం తెలిపారు. ఎకరా మూడు కోట్ల రూపాయలు ఉన్నా .. మాట కోసం పేదలకు ఫ్లాట్లు ఇస్తున్నామని చెప్పారు. సుప్రీం కోర్టులో టీడీపీ వారు కేసులు వేసి పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు ప్రభుత్వం ఇళ్లు ఇవ్వాలంటే సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని…రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైన రాజకీయం‌ చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని సిఎం తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/