మే లో గుంటూరు లో జాబ్ మేళా..

ఏపీలోని నిరుద్యోగులకు వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ వారిలో సంతోషాన్ని నింపుతున్నారు. ఇప్పటికే తిరుపతి, వైజాగ్ లో రెండు ప్రాంతీయ జాబ్ మేళాల్ని విజయవంతంగా నిర్వహించిన వైసీపీ.. ఇఫ్పుడు గుంటూరులో మూడో ప్రాంతీయ జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మే 7,8 తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరపనున్న జాబ్‌ మేళా పోస్టర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ మదిలో మెదిలిన ఆలోచనే ఈ జాబ్‌ మేళా. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే తిరుపతి, విశాఖలో తొలి రెండు విడతల్లో జాబ్ మేళా నిర్వహించాం. మూడో విడతగా నాగార్జున యూనివర్సిటీలో ఈ జాబ్ మేళా మే 7,8 తేదీల్లో నిర్వహించబోతున్నాం. ఇప్పటివరకు తిరుపతి, విశాఖలో 10వేల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకుంటే 30వేల ఉద్యోగాలు వచ్చాయి. విశాఖలో 23వేల మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఏఎన్‌యూలో జరిగే మేళాలో 148 కంపెనీలు, 70 వేల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయినట్లు తెలిపారు.

నాగార్జున యూనివర్శటీలో నిర్వహించే బాజ్‌మేళాకు ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.ఇప్పటికే ఈ జాబ్‌మేళాకు 77వేల మంది నిరుద్యోగులు రిజిస్టర్‌ చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ నిరుద్యోగిగా మిగలకూడదని అంత వరకు ఈ జాబ్‌ మేళా కార్యక్రమం కొనసాగించాలని సీఎం జగన్‌ ఆదేశించారని సాయిరెడ్డి తెలిపారు.