రేపు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ..

సీఎం జగన్ రేపు (సోమవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ తో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. వాస్తవంగా శనివారమే వెళ్లాల్సి ఉండగా, మంత్రులు ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో పర్యటనను రేపటికి వాయిదా వేశారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అంశాలు, విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి జగన్ మోడీ ఎదుట ప్రస్తావిస్తారని సమాచారం.

గత నెలలో కూడా జగన్ ..మోడీ ని కలవడం జరిగింది. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా రాజకీయ అంశాలు ప్రధానితో జగన్ చర్చించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, పోలవరం నిధులు విడుదల, పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు ఆమోదం, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని ప్రధానిని కోరారు. ఇప్పుడు మరోసారి మోడీతో భేటీ కాబోతున్నారు.