5న బీసీ డిక్లరేషన్ – టీడీపీ

ఈ నెల 5వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని ఆ పార్టీ పొలిట్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర తెలిపారు. ఆరోజు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జయహో బీసీ సమావేశాల్లో తెలుసుకున్న బీసీ మనోగతాన్ని ఇందులో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. త్వరలో ఎస్సీ, ఎస్టీలకూ వేర్వేరు డిక్లరేషన్లు ప్రకటిస్తామని వెల్లడించారు.

ఇదిలా ఉంటె టీడీపీ రెండో జాబితాపై ఆ పార్టీ సీనియర్లలో ఆందోళన నెలకొన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి లిస్ట్ లో కాకుండా రెండో లిస్టులో తమ పేరు కచ్చితంగా ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారట. అధిష్ఠానం చేసే మార్పుల్ని అంగీకరించేది లేదని, తమ స్థానాలను తమకే కేటాయించాలని తేల్చిచెబుతున్నారట. కిమిడి కళావెంకట్రావు, గంటా, దేవినేని వంటివారు తమ నియోజకవర్గాలను వదులుకునేందుకు సుముఖంగా లేరని సమాచారం. మరి వీరు కోరినట్లు ఆయా స్థానాలు వీరికే ఇస్తారా..? లేదా అనేది చూడాలి.