నేడే పల్స్ పోలియో.. నిండు జీవితానికి 2 చుక్కలు

చిన్నారులను పోలియో వ్యాధి నుంచి రక్షించే పల్స్ పోలియో కార్యక్రమం నేడు తెలుగు రాష్ట్రాల్లో జరగనుంది. అందుకోసం ఏపీలో 37,921, తెలంగాణలో 22,445 పోలియో బూత్లు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా మొబైల్ పాయింట్లను అందుబాటులో ఉంచారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని అధికారులు తెలిపారు.

కాగా బస్‌, రైల్వే స్టేషన్లు, సంచార ప్రాంతాలు, హైరిస్క్‌ ప్రాంతాల్లోనూ చిన్నారులకు పోలియో చుక్కలు వేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేయని చిన్నారులకు 4, 5వ తేదీల్లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారు. అంగన్‌ వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు.