రమేశ్‌ కుమార్‌ భద్రతకు ఆదేశాలు జారీ

ఆ లేఖ ఆయన రాసినట్టుగానే భావిస్తున్నాం.. ఆ మేరకు అవసరమైన నిర్ణయాలు

kishanreddy
kishanreddy

హైదరాబాద్‌: ఏపి రాష్ట్ర ఎన్నికల అధికారి రమేశ్‌కుమార్‌ భద్రత లేఖ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..రమేష్‌కుమార్‌ అవసరమైన భద్రత కల్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని ఆదేశించినట్లు మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత వ్యవహారమైనా అధికారులను బెదిరించినది నిజమైతే అది సరైన పద్ధతి కాదన్నారు. ప్రస్తుతం రమేష్‌కుమార్‌ హైదరాబాద్‌లో ఉన్నారని, ఆయనకు తగిన భద్రత ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లినప్పుడు కూడా తగిన భద్రత కల్పించాని ఏపీ సీఎస్‌ను ఆదేశించినట్లు తెలిపారు. అవసరమైతే లిఖిత పూర్వక ఆదేశాు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/