ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఆయనతో పాటు, ఆయన భార్య కవితల ఓట్లను తొలగించడమే దీనికి కారణం. సోమవారం ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. ఉదయం 7 గంటలక ప్రారంభమైన పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. అయితే విజయవాడలో ఓటేసేందుకు వెళ్లిన ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊహించని పరిస్థితి ఎదురైంది.

విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏబీ వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి ఆలూరి కవితలకు ఓట్లు ఉన్నాయి. నగరంలోని లయోలా కాలేజీ 59వ పోలింగ్ కేంద్రంలో వారిద్దరి ఓట్లు ఉండేవి. సోమవారం దంపతులిద్దూరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.. అయితే అక్కడ ఓటర్ల జాబితాలో ఇద్దరి పేర్లులేకపోవడంతో అవాక్కయ్యారు. ఫైనల్ జాబితా నుంచి వెంకటేశ్వరరావుతో పాటుగా భార్య కవిత పేర్లను తొలగించినట్లు ఉందని అధికారులు చెప్పడంతో వారు తమ ఓటును వినియోగించుకోలేకపోయారు. రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కూడా తన ఓటు కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.