బస్సులో రూ.కోటి స్వాధీనం

ఏకగ్రీవాల కోసం దాడులు,దౌర్జన్యాలు

Rs. Crore seized in bus
Rs. Crore seized


Amaravati /Jaggayapet: : రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యం లో తొలిదశ పోలింగ్‌కు సంబంధించిన నామినే షన్లపర్వం దాడులు, దౌర్జన్యాలు, తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన పలువురు గ్రామ వాలంటీర్లును, గ్రామ పరిపాలనా సిబ్బందిపైన అధికారాపార్టీ నేతలు ఒత్తిడి తేవడం వంటి సంఘటనలు పలు చోట్ల చోటు చేసుకున్నాయి.

పంచాయితీ ఎన్నికల్లో సాధ్యమైనన్ని సర్పంచ్‌ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడానికి అధికారపార్టీ నేతలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక డబ్బు పంపిణీ విషయంలో ఆదివారం సాయం త్రం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కోదాడ నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కృష్ణాజిల్లా చెక్‌పోస్టులో తనిఖీలు నిర్వహించిన సమ యంలో కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ డబ్బు ఆంధ్రప్రదేశ్‌లో జరుగు తున్న గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఉపయోగించేందుకు తరలిస్తున్న సొమ్మా? లేక హవాలా డబ్బా? అనే కోణంలో కృష్ణా జిల్లా పోలీసులు విచారణ ప్రారంభించారు. అలాగే అనంతపురం జిల్లాలో ఇన్నోవా వాహనం లో డబ్బును తరలిస్తున్న అధికారపార్టీకి చెందిన కుల్లాయి నాయక్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.

కుల్లాయి నాయక్‌ భార్య నల్లమాడ మండలం అరవవాండ్ల పల్లి సర్పంచ్‌ స్థానానికి అధికార వైసీపీ పార్టీ మద్దతుదారుగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం నుండి ఇన్నోవా వాహనంలో డబ్బులు తరలిస్తుం డగా, ముదిగుబ్బ పోలీసులు పట్టుకున్నారు. పాముదుర్తి క్రాస్‌లో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో రూ.2 లక్షలను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు.

కుల్లాయి నాయక్‌తోపాటు మరోవ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ముదిగుబ్బ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ విజ§్‌ుకుమార్‌ నేతృ త్వంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈకేసులో పట్టుబడిన కుల్లాయి నాయక్‌ను తప్పించాలంటూ పోలీసులపై స్థానిక అధికారపార్టీ నేతలు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలోని యాదమర్రిలో తెలుగుదేశంపార్టీ ఎమ్మె ల్సీ రాజసింహులు (దొరబాబు) వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/