మారిషస్ మాజీ అధ్యక్షుడు కన్నుమూత

ప్రవింద్ ను ఫోన్ ద్వారా పరామర్శించిన ప్రధాని మోడీ

పోర్ట్‌ లూయిస్‌: మారిషస్ మాజీ అధ్యక్షుడు అనిరుధ్ జగన్నాథ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. అనిరుధ్ మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.

పితృవియోగంతో బాధపడుతున్న మారిషస్ ప్రధాని ప్రవింద్ కు ఫోన్ చేసి సంతాపం తెలియజేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని గొప్ప రాజనీతిజ్ఞుల్లో అనిరుధ్ జగన్నాథ్ ఒకరని మోడీ కొనియాడారు. అనిరుధ్ జగన్నాథ్ ను భారత ప్రభుత్వం గతేడాది పద్మ విభూషణ్ తో సత్కరించింది. ఆయన రాజకీయ జీవితం 1963లో ప్రారంభమైంది. ఆయన రెండుసార్లు దేశాధ్యక్షుడిగా, ఆరుసార్లు ప్రధానిగా పనిచేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/