ఏపీలో 85 శాతం మేర పోలింగ్..?

ఏపీలో సోమవారం 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన పోలింగ్ జరిగింది. అక్కడక్కడా పలు చోట్ల విద్వంస ఘటనలు జరుగగా..మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్ర ఓటర్లు ఓటు వేసేందుకు పోటెత్తారు. దీంతో అర్ధరాత్రి దాటినా తరువాత కూడా పోలింగ్ జరిగింది. ఈసీ ఆదేశాల మేరకు సాయంత్రం 06 గంటల వరకే ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. 6 తర్వాత పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికీ ఓటు హక్కును వినియోగించే అవకాశం ఇచ్చారు. చాల చోట్ల ఈవీఎం లు నెమ్మదిగా పనిచేయడం తో ఓటు వేయడానికి అర్ధరాత్రి పట్టింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గత ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని సీఈఓ చెపుతున్నారు. 82 లేదా 85 శాతం వరకు పోలింగ్ ఫైనల్ ఫిగర్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం కల్లా పోలింగ్ శాతం తెలియనుంది. మచిలీపట్నం, గన్నవరం నియోజకవర్గాలు, సత్య సాయి జిల్లాల్లో రాత్రి 12 గంటల తర్వాత కూడా కొనసాగింది పోలింగ్. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేచి ఉన్నారు ఓటర్లు. ఇవాళ 17A స్క్రూట్నీ తర్వాత రీ-పోలింగ్ పై క్లారిటీ రానుంది. 11 చోట్ల ఈవీఎంల ధ్వంసం అయ్యాయి. వీటి వివరాలు ఇవాళ సాయంత్రం వస్తాయి.