ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు షెడ్యూల్ ఖరారు

దుబాయ్ లో మిగిలిన 31 మ్యాచ్ ల నిర్వహణ
సెప్టెంబరు 19 నుంచి టోర్నీ షురూ

ముంబయి: కరోనా కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 19 నుంచి దుబాయ్ లో మ‌ళ్లీ ప్రారంభించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. తాజాగా దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసింది.

భారత్ లో ఐపీఎల్ 14వ సీజన్ కు సంబంధించి 29 మ్యాచ్ లు జరగ్గా, మిగిలిన 31 మ్యాచ్ లను దుబాయ్ వేదికగా నిర్వహిస్తారు. సెప్టెంబరు 19న ఐపీఎల్ పోటీలు షురూ అవుతాయి. అక్టోబరు 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/