మల్బరీ సాగును ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట: మంత్రి హరీష్ రావు జిల్లాలోని చిన్నకోడూరు మండలం చందలాపూర్‌లోని రైతు పిల్లి ప్రభాకర్ వ్యవసాయ క్షేత్రంలో మల్బరీ మొక్కలను నాటి మల్బరీ సాగును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆధునిక పద్ధతుల్లో మల్బరీ సాగు సులువుగా మారిందని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు రూ.1300కోట్లు ఖర్చు చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో రూ.14500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.3300కోట్లు ఉచిత విద్యుత్‌కు ఖర్చు చేస్తే తెలంగాణలో రూ.10500 కోట్లు ఉచిత విద్యుత్‌కు ఖర్చు చేస్తుందని తెలిపారు.

రాష్ట్రం ఏర్పడ్డ మొదట్లో సాగు విస్తీర్ణం 24 మెట్రిక్ టన్నుల నుండి నేడు 90లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. వడ్లు నిల్వ చేయడానికి స్థలం లేనంతగా దేశంలోనే తెలంగాణలో వరి ధాన్యం పంటలు పండాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లు కొనమని ఉత్తరాలు రాస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/