రాజస్థాన్ మాజీ సిఎం అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్, స్వైన్ ఫ్లూ

కరోనా బారిన పడినట్టు స్వయంగా వెల్లడించిన గెహ్లాట్

Former Rajasthan CM Ashok Gehlot tests positive for Covid, swine flu

న్యూఢిల్లీః కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయినప్పటికీ… అక్కడక్కడ కేసులు బయటపడుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించారు. కొన్ని రోజులుగా తాను జ్వరంతో బాధపడుతున్నానని… డాక్టర్ల సలహా మేరకు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని… టెస్టులో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు. కరోనాతో పాటు స్వైన్ ఫ్లూ కూడా ఉందని చెప్పారు. కరోనా కారణంగా తాను రానున్న 7 రోజుల పాటు ఇంట్లోనే ఉంటానని… ఎవరినీ కలవబోనని తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.