రెండోసారి త‌ల్లిదండ్రులైన హ్యారీ, మేఘ‌న్‌ దంపతులు

కాలిఫోర్నియా: ప్రిన్స్‌ హ్యారీస్‌, మేఘన్‌ మార్కెల్‌ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. మేఘన్‌ ముద్దులొలికే పసిపాపకి జన్మనిచ్చింది జూన్‌ 4న కాలిఫోర్నియాలోని శాంట బార్బరా కాటేజ్‌ హాస్పటిల్‌లో మేఘన్‌ మార్కెట్‌ ప్రసవించింది. అప్పుడు హ్యరీ కూడా అక్కడే ఉన్నారు. హ్యారీ, మేఘన్‌ జీవితాల్లోకి వచ్చిన చిన్నారికి లిల్లీ డయానా అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరు వెనక పెద్ద కథే ఉంది. ప్రస్తుతం బ్రిటిష్‌ రాజకుటుంబ మహారాణి ఎలిజబెత్‌ చిన్నప్పటి ముద్దుపేరు లిల్లీబెట్‌. అలాగే రాచరికపు ఆంక్షలను ఎదిరించి చనిపోయిన తన హ్యారీ తల్లి పేరు డయానా. వీరిద్దరి గౌరవార్థం తన కూతురికి లిల్లీబెట్‌ డయాన మౌంట్‌బాటెన్‌ విండ్సర్‌ గా పేరు పెట్టారు. హ్యారీ- మేఘన్‌లకు ఇంతకు ముందు ఆర్చీ అనే కొడుకు 2019లో జన్మించాడు.

కాగా, హ్యారీ, మేఘన్ గత మార్చిలో ఫ్రంట్‌లైన్‌ రాయల్ విధుల నుంచి వైదొలిగి ప్ర‌స్తుతం కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. గత ఏడాది జనవరిలో ఇద్దరూ డ్యూక్ ఆఫ్ సస్సెక్స్, డచెస్ ఆఫ్ సస్సెక్స్ రాజ బిరుదులను విడిచిపెట్టినట్లు ప్రకటించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/