ఇందిరా పార్కులో అధునాతన వాకింగ్ ట్రాక్ పార్కు ప్రారంభం
పాల్గొన్న మంత్రి కేటిఆర్

Hyderabad: దోమలగూడలోని ఇందిరాపార్కులో ఒక ఎకరం విస్తీర్ణంలో అభివృద్ది చేసిన పంచతత్వ ఆక్యూప్రెజర్ వాకింగ్ ట్రాక్ పార్కును మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు.
సర్కిల్ పద్దతిలో ట్రాక్ పై నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలో ఉన్న నరాలపై వివిధ స్థాయిలో ఒత్తిడిని కలిగించే పద్దతిలో 20 ఎం.ఎం, 10 ఎం.ఎం రాళ్లు, రివర్ స్టోన్స్, 6 ఎం.ఎం చిప్స్, ఇసుక, చెట్ల బెరడు, నల్లరేగడి మట్టి, నీటి బ్లాక్‌లను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింట్ ట్రాక్‌ను నిర్మించారు.
ఈ సర్కిల్‌కు అన్ని వైపులా 40 రకాల మెడిసినల్, హెర్బల్ ప్లాంట్స్‌ను బ్లాక్‌లుగా ఏర్పాటు చేశారు.
ఈ పార్కు మధ్యలో గౌతమ బుద్దుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/