‘నితీష్ సర్కార్ ఎక్కువ కాలం ఉండదు ‘
జేడీయూ సీనియర్ నేత మనోజ్ కుమార్ ఝా
Patna: నితీష్ సర్కార్ ఎక్కువ కాలం ఉండదని జేడీయూ పేర్కొంది.
జేడీయూ సీనియర్ నేత మనోజ్ కుమార్ ఝా ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ…40 స్థానాలకు పరిమితమైన పార్టీ నేత ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు.
ప్రజా తీర్పు నితీష్ కు వ్యతిరేకంగా వచ్చిందన్నారు. మహాఘట్ బంధన్ నుంచి ఎన్డీయేలోకి మారడం ద్వారా నితీష్ 2017 ఎన్నికలలో ప్రజాతీర్పును కాలరాశారన్నారు.
బీహార్ ప్రజలు అందుకే తాజా ఎన్నికలలో నితీష్ పార్టీకి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/