దేశంలో 5 వేలకు పైనే కొత్త కరోనా కేసులు

india-active-covid-caseload-crosses-35000-mark

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 85,076 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,880 కేసులు బయటపడ్డాయి. మరోవైపు దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 35 వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 35,199 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,41,96,318 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో మొత్తం 14 మంది మృతి చెందగా.. కరోనా కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,30,979కి చేరింది.

ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.08 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.73 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.