ఈటెల ఫై మండిపడుతున్న అనుచరులు

రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కారు..ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లోకి వెళ్తారో ఎవ్వరు చెప్పలేరు. తమ స్వార్థం కోసం కొంతమంది పార్టీలు మారితే..మరికొంతమంది పార్టీ విధానాలు నచ్చక వెళ్తుంటారు. కానీ తమను నమ్ముకున్న అనుచరులు , నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎప్పుడు మోసపోతూనే ఉంటారు. తాజాగా ఈటెల ఫై కూడా అలాగే మండిపడుతున్నారు ఆయనను నమ్ముకున్నవారు.

ఈటెలను నమ్ముకొని బీజేపీలోకి వస్తే తన దారి తాను చూసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకొని తాను పదవి తెచ్చుకున్నాడని.. మరి మమ్మల్ని కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటెలను నమ్ముకుంటే ఇక తమ పరిస్థితి అంతేనని.. తమ దారి తాము చూసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈటెలకు అత్యంత సన్నిహితుడైన ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ మారతాడని జోరుగా ప్రచారం సాగుతుంది. గత నాలుగు రోజులుగా ఈటెలకు దూరంగా ఉంటున్న ఏనుగు రవీందర్ రెడ్డి.. తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో బిజెపికి గుడ్ బై యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. రవీందర్ తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు.