తూర్పుగోదావరిలో పెరుగుతున్న కరోనా కేసులు

రాజమండ్రిలో మూడు కంటైన్‌మెంట్‌ జోన్‌ల ఏర్పాటు

corona virus
corona virus

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 26 కరోనా పాజిటివ్‌కేసులు నమోదు అయ్యాయి. దీంతొ కొత్తగా రాజమండ్రిలో మూడు కంటైన్‌మెంట్‌ జోన్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి కంటైన్‌మెంట్‌ కు ఓ కంట్రోల్‌ రూం ఏర్పాటుచేసి నిత్యవసరాలు సరాఫరా చేసేందుకు రాజమండ్రి కార్పోరేషన్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా జిల్లాకు 7,423 రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు వచ్చాయని, వాటితో నేటినుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/