కిమ్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు కథనాలు !

ఇటీవల కిమ్ జాంగ్ ఉన్ కు గుండెఆపరేషన్

Kim Jong Un
Kim Jong Un

ప్యోన్‌గ్యాంగ్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితి క్షిణించినట్లు కథనాలు వస్తున్నాయి.

అయితే కిమ్‌ గుండెకు సర్జరీ అనంతరం తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని ఒక న్యూస్ సంస్థ పేర్కొంది.

కాగా కిమ్‌ పరిస్థితి గురించి ఓ అమెరికా ఉన్నతాధికారి చెప్పారని ఆ న్యూస్ సంస్థ తెలిపింది.

గత వారం వైభవంగా జరిగిన తన తాతయ్య పుట్టిన రోజు వేడుకలకు కిమ్ హాజరుకాలేదు. అనారోగ్యం కారణంగానే ఆయన రాలేదని తెలుస్తోంది.

సర్జరీ తరువాత కిమ్ పరిస్థితి ప్రమాదకరంగా మారిందని కథనాలు వెలువడుతున్నాయి. అ

యితే
ఆ న్యూస్ సంస్థ కథనాన్ని ధ్రువీరించలేమని దక్షిణ కొరియా స్పష్టం చేసింది.

కిమ్‌ ఆరోగ్యంపై వస్తున్నప్రచారాన్ని ఆ దేశం తోసిపుచ్చింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం, ఈ సంవత్సరంలో ఆయన 17 సార్లు ప్రజల ముందుకు వచ్చారని గుర్తు చేసింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/