దేశంలో పెరుగుతున్న కరోనా..24 గంటల్లో 1,336 కేసులు

24గంటల్లో 47 మంది మృతి..పెరుగుతున్న రికవరీ రేటు

coronavirus-India
coronavirus-India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,336 కొత్త కేసులు నమోదైనవి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 18,601కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 590 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 24 గంటల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,252 మంది కోలుకున్నారని చెప్పింది. ఆసుపత్రుల్లో 14,759 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.

ప్రాంతాల వారిగా కరోనా ఆప్‌ డెట్స్‌

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4,666కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 232 మంది మృతి చెందారు. 572 మంది కరోనా రోగులు కోలుకున్నారు.

ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,081కి చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో 431 మంది కోలుకున్నారు. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్‌లో 1,939 మందికి కరోనా సోకగా, 131 మంది కోలుకున్నారు. 71 మంది ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడులో 1,520 మందికి కరోనా సోకింది. వారిలో 457 మంది కోలుకున్నారు. 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్‌లో 1,576 మందికి కరోనా వైరస్ సోకింది. వారిలో 205 మంది కోలుకోగా, 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్‌లో 1,485 మంది కరోనా బాధితులున్నారు. 127 మంది కోలుకోగా, 74 మంది మృతి చెందారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/