హైదరాబాద్ లో నాన్ వెజ్ షాప్స్ బంద్

హైదరాబాద్ నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..ఈ ఆదివారం నగరవ్యాప్తంగా నాన్ వెజ్ షాప్స్ క్లోజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం నాన్ వెజ్ ప్రియులు ఎక్కువయ్యారు. ప్రతి రోజు నాన్ వెజ్ తినే వారు కూడా ఉన్నారు. ఇక సండే వచ్చిందంటే ప్రతి ఇంట్లో నాన్ వెజ్ వాసన ఉండాల్సిందే. అయితే తాజాగా నగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) షాకింగ్ న్యూస్ చెప్పింది.

ఈ ఆదివారం(ఏప్రిల్ 21) మహావీర్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా కబేళాలు, మీట్, బీఫ్ మార్కెట్లతో పాటు మాంసం షాపులు బంద్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ వెల్లడించారు.