న్యూజిలాండ్‌పై భారత్‌ మహిళల జట్టు విజయం

ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ల్లో బెర్త్‌ ఖరారు

India women's national cricket team
India women’s national cricket team

మెల్‌బోర్న్‌: ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత అమ్మాయిలు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఓవెల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని.. మెగా టోర్నీ నాకౌట్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. అమెలియా కెర్ర్‌ (34; 18 బంతుల్లో 6్ల4) ఇన్నింగ్స్ చివరలో ధాటిగా ఆడినా కివీస్‌ గెలుపొందలేదు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/