ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై టీడీపీ ఎమ్మెల్యేలు వరుస ప్రశ్నలు సంధించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పలుమార్లు అసెంబ్లీని వాయిదా వేయడం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు సభను ఉద్దేశపూర్వకంగా జరగనీయకుండా చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి ఆరోపించారు.

పరిపాలనా వికేంద్రీకరణపై జరుగుతున్న చర్చను అడ్డుకోవడం సరికాదని, సభ సజావుగా జరగడానికి టీడీపీ సభ్యులు సహకరించడం లేదని పేర్కొంటూ వారిని సస్పెండ్ చేయాలనీ కోరారు. దీంతో స్పీకర్ ఒక రోజు టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకటరెడ్డి, సీవీ జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్ రావు, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంచల రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి తదితరులను సభ నుంచి సస్పెండ్ చేసారు.