తెలంగాణలో కొత్తగా 1,831 మందికి కరోనా

306కి పెరిగిన మృతుల సంఖ్య

తెలంగాణలో కొత్తగా 1,831 మందికి కరోనా
corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తుంది. సోమవారం కొత్తగా 1,831 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25,733కి చేరింది. అటు, ఒక్క రోజులో 11 మంది మరణించగా, కరోనా మృతుల సంఖ్య 306కి పెరిగింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కంటే నేడు డిశ్చార్జి అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా 2,078 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 10,646 మంది చికిత్స పొందుతున్నారు. ప్రాంతాల వారీగా చూస్తే… జీహెచ్ఎంసీ పరిధిలో 1,419 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ జిల్లాలో 117 కేసులు వెల్లడయ్యాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/