రైతుల ఖాతాల్లో రూ.571.57కోట్లు జమ చేసిన సీఎం జగన్‌

రైతుల‌కు అండగా ఉంటామ‌న్న జ‌గ‌న్

YouTube video
Hon’ble CM of AP will be Disbursing Input Subsidy for Farmers Virtually from Camp Office

అమరావతి : గ‌త ఏడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల కార‌ణంగా ఏపీలో రైతులు భారీగా పంట నష్టపోయిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయా రైతుల ఖాతాల్లో వైస్సార్సీపీ ప్రభుత్వం ఈ రోజు ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం జగన్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… 5,97,311 మంది రైతన్నలకు దీని ద్వారా లబ్ధి చేకూరనుందని చెప్పారు. మొత్తం రూ.542.06 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ వేశామ‌ని తెలిపారు.

1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు జ‌మ చేశామ‌న్నారు. రైతుల‌కు త‌మ ప్ర‌భుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంద‌ని తెలిపారు. ఏ సీజ‌న్‌లో పంట నష్టపోతే అదే సీజన్‌లో పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. అర్హులంద‌రికీ ప‌రిహారం అందిస్తున్నామ‌ని, పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామ‌ని తెలిపారు. గ్రామీణ స్థాయుల్లో ఆర్బీకే కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితా డిస్‌ప్లే చేస్తున్నామ‌ని వివ‌రించారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ.1,612 కోట్ల సాయం అందించామ‌ని తెలిపారు. రాష్ట్రంలో 18.70 లక్షల మంది రైతులకు పగటిపూట‌ నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/