ఉక్రెయిన్‌ను వ‌దిలి స్వ‌దేశానికి వ‌చ్చేయాలి : భార‌త్

ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం నుంచి ప్రకటన


న్యూఢిల్లీ : రేపు (బుధవారం) ఉక్రెయిన్ పై రష్యా బలగాలు దాడికి దిగుతాయని తమకు సమాచారం అందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్‌ స్కీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన భార‌త్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉక్రెయిన్లో ఉంటున్న భారతీయులు స్వ‌దేశానికి వ‌చ్చేయాల‌ని చెప్పింది.

ప్ర‌ధానంగా ఉక్రెయిన్‌లో ఉండ‌డం త‌ప్ప‌నిస‌రికాని భార‌తీయులు వెంట‌నే భార‌త్ వ‌చ్చేయాల‌ని సూచించింది. కీవ్‌లో ఉన్న ఎంబ‌సీతో భార‌తీయులు ట‌చ్‌లో ఉండాల‌ని, ఏదైనా విప‌త్తు జ‌రిగితే త‌క్ష‌ణ‌మే అక్క‌డికి స‌హాయం పంపేందుకు స‌మాచారం ఇవ్వాల‌ని ఎంబ‌సీ వెల్ల‌డించింది. ఉక్రెయిన్‌లో ఉన్న భార‌తీయుల‌కు స‌హాయ‌స‌హ‌కారాలు అందించేందుకు ఎంబ‌సీ నిత్యం ప‌నిచేస్తుంద‌ని అన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదలయింది. రేపు ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా కూడా ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేసింది. ఈనేపథ్యంలో అన్ని దేశాలు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/