నేడు సిఎం జగన్‌తో హైపవర్‌ కమిటీ భేటీ

CM Jagan
CM Jagan

అమరావతి: రాజధానిపై నియమించిన హైపవర్ కమిటీ నేడు సిఎం జగన్‌తో భేటీ కానుంది.
ఏపిలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన ఈ కమిటీ.. సీఎం క్యాంపు కార్యాలయంలో రాజధానిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది. అంతేకాదు.. రాజధాని రైతుల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. జీఎన్‌ రావు, బిసిజి నివేదికలను పరిశీలించిన హైపవర్‌ కమిటీ.. ఇప్పటికే మూడు సార్లు సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపారు. అయితే.. సిఎంతో భేటీ సందర్భంగా రాజధాని తరలింపుపై, అమరావతి రైతుల సమస్యలపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. విశాఖలో సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తే.. అక్కడికి తరలివెళ్లే ఉద్యోగులకు కల్పించాల్సిన సౌకర్యాలపైనా భేటీలో చర్చించనున్నారు. రాజధాని తరలింపు ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించాలి? ఎప్పటికి పూర్తి చేయాలి? తదితర అంశాలపైనా భేటీలో ప్రస్తావించనున్నారు. ఇదిలా ఉండగా, రాజధాని అంశంపై ఈ నెల 20న ఏపి అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/