పవన్ కళ్యాణ్ ఫై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సెటైర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై..భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సెటైర్లు వేశారు. కాస్త పవన్ కు నిజాలు చెప్పండయ్యా..వాస్తవ విరుద్ధమైన సమాచారం ఇస్తూ పవన్‌ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని గ్రంధి అన్నారు. భీమవరం మండల పరిషత్తు కార్యాలయంలో జరిగిన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ..వీరవాసరంలో గెలుపొందిన తమ వారు సంబరాలు చేసుకోకుండా వైసీపీ పార్టీ అడ్డుపడుతోందని పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. వాస్తవ విరుద్ధమైన సమాచారం ఇస్తూ పవన్‌ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. సంబరాలు చేసుకోకుండా మేం ఎవరినీ అడ్డుకోలేదని.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

రాష్ట్రంలో కోవిడ్‌ నిబంధనలు పాటించాలని ఏపీ హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని గ్రంధి శ్రీనివాస్ గుర్తుచేశారు. అందుకే తమ సొంత పార్టీ వైసీపీ నాయకులను సంబరాలకు దూరంగా ఉండాలని సూచించానని తెలిపారు.