రైతుల అభిప్రాయాల నమోదులో సాంకేతిక లోపం

Amaravati farmers
Amaravati farmers

అమరావతి: రాజధాని అంశంపై అమరావతి ప్రాంత రైతుల నుంచి ఆన్ లైన్ ద్వారా సేకరిస్తున్న అభిప్రాయ సేకరణకు ఆటంకం కలిగింది. నమోదు ప్రక్రియలో సాంకేతిక లోపం తలెత్తింది. రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తుళ్లూరులోని సీఆర్డీయే కార్యాలయంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. హైపవర్ కమిటీకి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను తెలపవచ్చని రైతులకు సూచించారు. ఈ నేపథ్యంలో, తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు వెళ్లిన రైతులకు షాక్ తగిలింది. సర్వర్ డౌన్ కావడంతో రైతుల అభిప్రాయాలు నమోదు కావడం లేదు. 45 గంటల తర్వాత తిరిగి ప్రయత్నించాలనే సమాధానం వస్తోంది. మరోవైపు, అభ్యంతరాల స్వీకరణకు ఈరోజే చివరి రోజు కావడంతో ఏం చేయాలో అర్థంకాక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/