ఏపి రాజధానులపై కాసేపట్లో హైకోర్టు విచారణ
రాజధాని ప్రతిపాదనను సవాల్ చేస్తూ 37 మంది రైతుల పిటిషన్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రతిపాదనను సవాల్ చేస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. కాగా ఈ విషయానికి సంబంధించి ఏపి హైకోర్టులో కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ 37 మంది రైతుల పిటిషన్లు వేశారు. అలాగే సీఆర్‌డీఏకి రైతులు తమ అభిప్రాయాలు తెలపడానికి ఇచ్చిన గడువును పెంచేలా ఆదేశాలివ్వాలమని పిటిషన్ వేశారు. అమరావతి రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 అమలు సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. సీఆర్‌డీఏ రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా పిటిషన్ వచ్చింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/