బుధువారం నుండి షర్మిల జిల్లాల పర్యటన

ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల రేపటి నుండి (బుధువారం) జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ తాలూకా వివరాలు మీడియా కు తెలిపారు. ఈ నెల 7న బాపట్లలో బహిరంగ సభ, 8న ఉదయం తెనాలిలో రచ్చబండ, సాయంత్రం ఉంగుటూరులో సభ, 9న ఉదయం కొవ్వూరులో రచ్చబండ, సాయంత్రం తునిలో బహిరంగ సభ, 10న ఉదయం నర్సీపట్నంలో రచ్చబండ, సాయంత్రం పాడేరులో బహిరంగసభ, 11న నగరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. వాస్తవరానికి రెండు రోజుల క్రితం అనంతపురం లో పర్యటించాల్సి ఉండగా ,,,ఆమెకు ఫీవర్ రావడం తో అనంతపురం టూర్ ను రద్దు చేసుకున్నారు.

ఇక ఏపీసీసీ గా బాధ్యతలు చేపట్టిన నాటినుండి షర్మిల తన దూకుడు కనపరుస్తున్నారు. ఐదేళ్ల లో రాష్ట్రం ఏ విధంగా మారిందో..దీనికి కారణం ఎవరో షర్మిల ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు. సొంత అన్న అని కూడా చూడకుండా వైసీపీ అధినేత జగన్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీ ప్రత్యేక హోదా , పోలవరం , విభజన హామీలు తదితర అంశాలను లేవనెత్తి బిజెపి ఫై నిప్పులు చెరుగుతున్నారు.