బిజెపి మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి

ధర్నాకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో కోర్టుకెక్కిన బిజెపి

high-court-green-signal-to-bjp-maha-dharna

హైదరాబాద్‌ః తెలంగాణ హైకోర్టు బిజెపి మహాధర్నాకు సోమవారం పచ్చజెండా ఊపింది. మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నాకు బిజెపి అనుమతి కోరగా, పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో ఆ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ధర్నా చేసుకోవడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రేపు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నారు.

ఈ ధర్నాకు అనుమతిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతిభద్రతలకు విఘాతం కలగలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతిభద్రతలు గుర్తుకు రాలేదా? అడిగింది. ప్రభుత్వం కనీసం 5,000 మందికి కూడా భద్రత కల్పించకపోతే ఎలా? అని కూడా ప్రశ్నించింది. ఆ తర్వాత బిజెపి మహా ధర్నాకు హైకోర్టు అనుమతి నిచ్చింది. ఈ ధర్నాలో 500 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని పేర్కొంది.