హైదరాబాద్-విజయవాడ మార్గంలో నిలిచినా వాహనాలు

చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద లారీ బోల్తా

చిట్యాల: హైదరాబాద్-విజయవాడ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద డివైడర్‌ను ఢీకొన్న లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది.

దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గం వాహనాలతో నిండిపోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుకు అడ్డంగా పడిన లారీని తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/